మకర సంక్రాంతి – మీకందించాలి నూతన క్రాంతి!
సంక్రాంతి అనగానే పిల్లకాయలనుండి పెద్దవాళ్ళు వరకు ఎనలేని ఉల్లాసం, ఉత్సాహం. ఎందుకంటె క్రొత్త సంవతరంలో వచ్చే మొదటి పండగ, మన తెలుగు వాళ్ళందరికి చాలా పెద్ద పండగ మరియు ముఖ్యమైన పండగ. అంతేకాక వరుసగా జరుపుకునే మూడు రోజులు పండగ.
చిన్నప్పుడు అర్దసంవత్సర పరిక్షలు అయిపోగానే సంక్రాంతి సెలవులకోసం గంతులేసే క్షణాలు,ప్రతి ఇంటా కదంతొక్కే ఆనందపు పరవళ్ళూ, కొత్త బట్టల కొనిమ్మని చేసే అలకలు, చలి కాచే భోగి మంటలు, ఇంటికొచ్చే పాడి పంటలు, వాకీట్లొ వెలిసే ముగ్గులు, ముద్దుగొలిపె గొబ్బిళ్ళు, కోడి పందాలు, పతంగుల ఆటలు, కమ్మనైన పిండి వంటలు..ఇతరులతొ పంచుకునే మధురబావాలు, సంతోషపు సరాదాలు.. ఆహా తలుచుకుంటే కావా ఇవి మధురస్మృతులు…
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈ మకర సంక్రాంతి సరి కొత్త క్రాంతి ని ప్రభావితం చేయాలని ఆకాంక్షిస్తూ…
భోగి మంటలు
అమ్మమ్మ చేతి పిండివంటలు
గంగిరెద్దులు
హరిదాసులు
రంగురంగుల పతంగులు
వచ్చేసింది సంక్రాంతి…
మీకు మీ కుంటుంబ సభ్యులందరికి
so nice sister nice post .....
thank for postingg