Blogger Widgets

Dussehra wishes

 
                  ** HAPPY NAVRATRI **
             May Goddess Durga destroy all evil around you.


         May this Navratri... Bring You Joy and Happiness...
To last through out the year!

        ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుండి దసమి వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఈ నవరాత్రులు దుర్గా దేవికి ప్రత్యేక పూజలు శాంతి హోమాలు జరుపుట ఆనవాయతి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు...

శరన్నవరాత్రులలోని మొదటి రోజు దేవిని పసుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. నవరాత్రి అలంకారాలలో తొలి రోజునే కనకదుర్గా దేవిని దర్శించుకున్నవారికి దారిద్ర్య బాధలు మటుమాయము అవుతాయని భక్తుల నమ్మకము.

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.

విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగలలో దేవీ నవరాత్రులు అత్యంత ప్రధానమైనవి. శరదృతువులో ఆశ్వియుజ శుధ్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఈ వేడుకలు జరుగుతాయి. దేవి అంటే త్రిమూర్తుల తేజం కలగలిసిన మహాశక్తి. విజయవాడ కనకదుర్గ అలంకారాలే రాష్ట్రములోని మిగతా ప్రాంతాలలో కూడా అనుసరిస్తారు.

ఎన్ని కథలున్నా కనకదుర్గగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దేవికి శరన్నవరాత్రుల పేరిట దసరా తొమ్మిది రోజులు ఉత్సవములు నిర్వహించడము అనాదిగా వస్తున్న ఆచారము. ఈ పది రోజులు దేవి ఒక్కో అలంకారముతో భక్తులకు దర్శనమిస్తింది.


విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి. ఆ రోజున ఆరంభించే ఏ పని, వృత్తి, వ్యాపారం అయినా అఖండ విజయం సాధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభిద్దాం!

విజయీభవ..!

అందరికి విజయదశమి శుభాకాంక్షలు..


తేది వారము నక్షత్రము తిధి అలంకారములు
28-09- 2011 భుదవారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ బాలత్రిపుర సుందరి దేవి
29-09-2011 గురువారం ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ గాయత్రి దేవి
30-09-2011 శ్రుక్రవారము ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ మహా లక్ష్మి దేవి
01-10- 2011 శనివారము ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ అన్నపూర్ణ దేవి
02-10-2011 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
03-10-2011 సోమవారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి (మూలా నక్షత్రము) శ్రీ సరస్వతి దేవి
04-10- 2011 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గా దేవి
05-10- 2011 భుదవారము ఆశ్వయుజ శుద్ధ నవమి శ్రీ మహిషాసుర మర్ధిని దేవి
06-10-2011 గురువారం ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) శ్రీ రాజరాజేశ్వరీ దేవి
          బ్లాగు మితృలందరికి     దేవీ నవరాత్రులా  శుభాకాంక్షలు 
 

Leave a Reply