Blogger Widgets

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...

"దెబ్బ తీయటం గొప్ప కాదు, దెబ్బను సహించటం గొప్ప. అందుకు ఎంతో ఆత్మస్థైర్యం కావాలి" అని నిరూపించిన జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడలు ప్రతి భారతీయుడికీ మార్గదర్శకాలు.
సత్యాగ్రహం కావచ్చు, దండి సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు... ఇలా మహాత్ముడు చేపట్టిన ఏ ఉద్యమానికయినా ప్రజలు సంపూర్ణ మద్ధతును, సహకారాన్ని అందించారు. "వందేమాతరం" అంటూ ముక్తకంఠంతో ఆయన వెంట జనప్రవాహమై సాగిపోయారు.

అలా సాగిన ఆ పోరాటానికి 1947 ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రిలో ప్రతిఫలం లభించింది. అంత చీకట్లో కూడా కోట్లాది భారతీయుల కళ్ళల్లో కోట్ల కాంతుల ఉషోదయం విరజిమ్మింది. ఆ ఉషోదయానికి ఇప్పుడు అరవై ఐదేళ్ళు. ..

"ఏ దేశమేగినా,ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము"
..... అని ఎలుగెత్తి కీర్తించిన రాయప్రోలు సుబ్బారావు గారి ప్రబోధాన్ని ఒక్కసారి మననం చేసుకుని భారతదేశంలో కానీ, విదేశాలలో కానీ ఎక్కడ వున్నా ప్రతి భారతీయుడు కుల , మత, వర్గ భేదమేమి లేకుండా "నేను భారతియుడను " అని గర్వంగా ఈ ఉత్సవాలను జరుపుకోవాలని ఆశపడుతూ నా పేజిలో ఉన్న కవి మిత్రులకు మరియు ప్రతి భారతీయుడికి ఇవేనా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...
వందేమాతరం
 

Leave a Reply