Blogger Widgets

"ప్లాస్టిక్ ....రాకాసి "


మన పర్యావరణానికి అవరోధం కలిగిస్తున్న వాటిలో ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరం. 1930 సం||లో సత్యం బయటపదింది. ఒక ప్లాస్టిక్ వస్తువు మట్టిలో పూర్తిగా కలవాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. నానాటికి పెరిగి పోతున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు 1999 లో కేంద్రంలోని పర్యావరణ ఆటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు కూడ జారి చేసింది. అయితే అమలుకు సంబంధించి ప్రభుత్వాలు ప్రజలు పెద్దగా శ్రద్ద చూపడం లేదు. ప్రభుత్వం 2006/07 ను జాతీయ పర్యావరణ జాగృతి అవగాహన సంవత్సరంగా ప్రకతించింది. 20 శతాబ్దం ప్లాస్టిక్ యుగంగా మారింది. మానవుడు దీనికి బానిసయ్యాడు. దీనిని వదులుకోలేని పరిస్థితికి చేరాడంటే అది అతిశయోక్తి కాదు.

వాడకం విస్తృతం:
1. ప్రతి మనిషి ఏడాదికి సగటున 4 కేజీల పాలితిన్ వాదుతున్నారు
2.
దేశ వ్యాప్తంగా సంవత్సరానికి 30 లక్షల టన్నుల క్యేరి బ్యేగులు, వాటర్ బాటిల్స్ & టీ కప్పుల రూపంలో వాడుతున్నారు
3.
రాష్ట్రంలో క్యేరి బ్యాగుల ఉత్పత్తి 300 టన్నులకు మించి పోయింది.
ఒక హైదరాబాదులోనే ఏటా 100 టన్నుల ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్నారు
మునిసిపాలిటిలు సేకరించే చెత్తలో ఐదు శాతానికి మించి ప్లాస్టిక్ వ్యర్దాలుంటున్నాయి.
4.
ఫర్నిచర్, పనిముట్లు, వంటింటి సామగ్రి, పాద రక్షలు, సీసాలు, ఫోటో ఫ్రేములు, డ్రైనేజి పైపులు, చాపలు
5.
సిరింజిలు, సెలైన్ బాటిళ్లు, ట్యూబుల తయారి
6.
ఆటో మొబైల్ రంగంలోను, కంప్యూటర్లు, మానిటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం
7.
ఓవర్హెడ్ వాటర్ ట్యాంకులు, బక్కెట్లు,…
ప్లాస్టిక్ వ్యర్దాలతో నష్టాలు అనూహ్యం:
1. వర్షపు జలాలు భూగర్బానికి చేరకుండా అడ్డుకుంటాయి
2.
ప్లాస్టిక్ బ్యాగులు, కప్స్, గ్లాసుల్లో వేడి ఆహర పదార్థాలను తీసుకోవడం ద్వారా క్యేన్సరుకు ఆహ్వానం
3.
తగలపెట్టడం వలన డైయోక్సిన్ వాయువు గాలిలోకి వెళ్లి క్యేన్సర్ వ్యాధికి దారితీస్తుంది
4.
పశుగ్రాసం లేక పశువులు ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయి. పశువులను వండుకుని తినడం వలన కొత్త రోగాలు వస్తాయి
5.
చెరువులు నదులలో వ్యర్థాలను వేయడం వలన వీటిని తినే చేపలు మృత్యు వాత పడుతున్నాయి
నివారణ మార్గాలు:
1. ప్లాస్టిక్ సంచులను బయోడిగ్రేడబుల్గా 20 మైక్రాన్లకంటే మందం తక్కువ కాకుండా 12 అంగుళాల పొడవు 8 అంగుళాల వెడల్పుతో మాత్రమే తయారు చెయ్యించాలి.
2.
వీలైనంత వరకు వీటి వాడకాన్ని తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరు దీనిని తమ భాధ్యతగా గుర్తించాలి
3.
కవర్లు, కప్పులు, వాటర్ బాటిల్స్ ను బహిరంగ ప్రదేశాల్లో పడెయ్యడానికి చరమ గీతం పాడాలి.
4.
పాలితిన్ కవర్లవలన కలిగే అనర్థాలను గుర్తించి ప్రజలు చైతన్య వంతులు కావాలి. వీటి తయారిని కట్టిడి చేసే దిశగా కాలుష్య నియంత్రణ మండలి, ప్రభుత్వాలు శ్రద్ద చూపాలి
          
!నాగరీకపు,ఆధునిక మానవా!
ఎగిసి పడే ,నీ ....స్వార్ధపు జ్వాలలతో!
నిన్నునీవే! నిలువెల్లా,కాల్చుకుంటూ,
నిన్నునీవే!అపర బ్రహ్మగా పోల్చుకుంటూ,
ప్రకృతిని !సర్వం ! వికృతం చేస్తున్నావ్ !
హిమాలయాల్నే!కాలుష్యంతో కరగిస్తూ,
ప్రాణి కోటి ప్రగతినే,ప్రశ్నార్ధకం చేస్తున్నావ్ !
వనాలు నరుకుతూ,జీవాలను తరుగుతూ,
పంచ భూతాలను సైతం కలుషితం చేస్తూ,
జగత్కల్లోల కాలుష్యాన్నిసృష్టిస్తున్నావ్ !
ధరణి కాంత ఆకు పచ్చని సోయగాలకు ,
ఒంటి చుట్టూ రక్షా కవచంగా చుట్టుకున్న,
ఓజోన్ నాజూకు,చీరకు రంధ్రాలు చేస్తూ,
నాగరికత మోజులో,నగ్నత్వం చూస్తున్నావ్!
ప్రక్రుతి సమ తౌల్యం లోపింప చేస్తూ,
నీ మితిమీరిన !అతి తెలివితేటలతో ,
ఎడారుల్లో !మల్లెలు పుయిస్తానంటున్నావ్!
సహజ వనరులను అసహజం చేస్తూ!
కృత్రిమ వర్షాలను కురిపింప చేస్తానంటున్నావ్!
పతనోన్ముఖంగా పయనిస్తూ,
పచ్చని ప్రకృతిని,నీ భాస్మాసురహస్తంతో,
 భస్మీపటలం చేస్తున్నావ్!
నీ నాగరికతా మంత్ర దండంతో,
ప్లాస్టిక్ రాకాసిని సృష్టించి దాంతో,
అడ్డమైన గొడ్డు చాకిరీ చేయిస్తున్నావ్
నీ నాశనాన్ని నువ్వే!కొని తెచ్చుకుంటున్నావ్ !
!మానవా!ఇకనైనా!మేలుకో!
నీ !సొంత లాభం!కొంత!మానుకో!
నీ !పర్యావరణాన్ని!పరి రక్షించుకో!
నీ !చేతిలోనే!ఉంది!భవిష్యత్ ప్రగతి!
నీ!చేతల్లోనే!ఉంది దాని పురోగతి!!!


Leave a Reply